స్టాక్ మార్కెట్ల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. జూన్ నాటికి విదేశీ ఇన్వెస్టర్లు 50,203 కోట్ల రూపాయలు అమ్మకాలకు పాల్పడ్డారు. జులైలో 4,989 కోట్ల రూపాయలను మన ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. ఎన్‌ఎస్‌డిఎల్ డేటా ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు మే నెలలో 39,993 కోట్లు, ఏప్రిల్‌లో 17,144 కోట్ల రూపాయల పెట్టుబడులను తరలించుకుపోయారు. జూన్‌లో ఇది 50,203 కోట్లుగా నమోదైంది. జులైలో మాత్రం విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ తగ్గింది. అదే సమయంలో మన మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైందని ఎన్‌ఎస్‌డిఎల్ తెలిపింది.
అమెరికా మార్కెట్లలో కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటంతోతో ఇన్వెస్టర్లు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు. జులైలో మన మార్కెట్లు లాబాల్లో ట్రేడ్ కావడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెడుతున్నారు. మార్కెట్లు మెరుగ్గా ఉండేందుకు దేశీయ ఇన్వెస్టర్ల మద్దతు ప్రధానంగా దోహదపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు జులైలో ఈక్విటీ మార్కెట్‌లో 1.33 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. జూన్‌లో 5.97 బిలియన్ల పెట్టుబడులు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు, విదేశీ ఇన్వెస్టర్లను కమాడిటీ మార్కెట్లో డిరవేటీస్‌లో పెట్టుబడులు పెట్టుందుకు సెబీ అనుమతించడం వంటి చర్యల మూలంగా విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మన మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారని భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.