Saturday, November 23, 2024

48,500 ఏళ్ల నాటి జోంబీ వైరస్‌ పునరుద్ధరణ

కరుగుతున్న పురాతన మంచు వల్ల మానవులకు కొత్త ముప్పు పొంచివుందని యూరోపియన్‌ పరిశోధకులు అభిప్రాయపడ్డారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో 48,500 ఏళ్లనాటి సరస్సు కింద స్తంభింపజేసిన వైరస్‌తో సహా దాదాపు రెండు డజన్ల వైరస్‌లను పునరుద్ధరించారు. పురాతన నమూనాలను పరిశీలించారు. జోంబీ వైరస్‌లుగా పిలిచే 13 కొత్త వ్యాధికారకాలను వర్గీకరించారు. వాటిని అంటువ్యాధి కారకాలుగా పేర్కొన్నారు. మీథేన్‌ వంటి గ్రీన్ హౌస్‌ వాయువుల విడుదల వాతావరణ మార్పును మరింత దిగజార్చుతుందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు.

కానీ నిద్రాణమైన వ్యాధికారకాలపై దాని ప్రభావాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయలేదు. ఇప్పుడు రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌ల పరిశోధకుల బృందం ఈ దిశగా పరిశోధనలు ప్రారంభించారు. పురాతన శాశ్వత మంచు కరిగేటప్పుడు ఈ తెలియని వైరస్‌లను విడుదల చేసే అవకాశం ఉంది అని వారు ప్రీప్రింట్‌ రిపోజిటరీ బయోఆర్‌క్సివ్‌కి పోస్ట్‌ చేసిన కథనంలో రాశారు. అది ఇంకా పీర్‌-రివ్యూ చేయబడలేదు. ఒకసారి బహిరంగ పరిస్థితులకు గురైనప్పుడు ఈ వైరస్‌లు ఎంతకాలం అంటువ్యాధిగా ఉండగలవు అనే దానిపై అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement