Friday, October 18, 2024

G-20 Summit | 48 గంటలు, 15 భేటీలు.. ప్రధాని మోదీతో భేటీ కానున్న యూఎస్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షులు

రెండు రోజుల జీ-20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మోడీ ముఖాముఖి చర్చలు జరిపేవారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌ ఉన్నారు. జో బైడెన్‌తో పాటుగా బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో ఆయన తన అధికారిక నివాసంలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మారిషస్‌ దేశాధినేతతో కూడా ప్రధాని మోడీ సమావేశమవుతారు.

బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలను మోడీ శనివారం జరుపుతారు. జీ-20 శిఖరాగ్ర సదస్సు చివరి రోజున ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌తో మధ్యాహ్న భోజన భేటీని ప్రధాని మోడీ నిర్వహిస్తారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడావ్‌తో ఇష్టాగోష్ఠి జరుపుతారు. కెమెరోస్‌, టుర్కియా, యూఏయీ, దక్షిణ కొరియా, ఐరోపా యూనియన్‌, బ్రెజిల్‌, నైజీరియా దేశాధినేతలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement