ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ పట్టణంలో ఆరోగ్య నిపుణులనే ఆశ్చర్యానికి గురిచేసే ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల వ్యక్తి సైనస్‌కు సీటీ స్కాన్ నిర్వహించగా రిపోర్టు నార్మల్‌గా వచ్చింది. ఆ తర్వాత ఎండోస్కోపీ నిర్వహించగా అతడిలో మూడు రకాల ఫంగస్‌లు (బ్లాక్, వైట్, యెల్లో) ఉన్నట్లు తేలింది.
అయితే యెల్లో ఫంగస్ సాధారణంగా సరీసృపాల్లో కనిపిస్తుందని, మానవుల్లో ఈ రకం ఫంగస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి అని ఘజియాబాద్‌కు చెందిన ఈఎన్‌టీ స్పెషలిస్టు డాక్టర్ బీపీ త్యాగి చెప్పారు. మానవుల్లో యెల్లో ఫంగస్ ఆనవాళ్లకు సంబంధించి ఏ జర్నల్‌లోనో రిఫరెన్స్ లేదన్నారు. ఈ ఫంగస్ ఆంఫోటెరిసిన్-బి అనే ఔషధం ద్వారా క్యూర్ అవుతుందని, కానీ వైట్, బ్లాక్ ఫంగస్‌లతో పోల్చితే యెల్లో ఫంగస్ నుంచి క్యూర్ కావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని చెప్పారు.