Saturday, November 23, 2024

ఒడిశాలో రైలు ప్రమాదం – 43 రైళ్లు రద్దు

ఒడిశాలో శుక్రవారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదం వందలాది మందిని బలి తీసుకుంది. ఇప్పటికే మృతుల సంఖ్య 294 కు చేరుకుంది. దాదాపు 900 మందికి పైగా క్షతగాత్రులు అయినట్టు అధికారిక సమాచారం..

ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే 43 రైళ్ళను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. టాటా నగర్ స్టేషన్ మీదుగా మరో ఏడు రైళ్లు దారి మళ్లించినట్లుగా రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను వెల్లడించారు. ప్రయాణికులు ఈ వివరాలను ఫాలో అవ్వాలని కోరారు.

రద్దయిన రైల్లు ఇవే

హావ్ డా-పూరీ సూపర్ ఫాస్ట్ (12837)హావ్ డా బెంగళూరు సూపర్ ఫాస్ట్ (12863)హావ్ డా-చెన్నై మెయిల్హావ్ డా- సికింద్రాబాద్ (12703)హావ్ డా-హైదరాబాద్ (18045)హావ్ డా-తిరుపతి (20889)హావ్ డా- పూరి సూపర్ ఫాస్ట్(12895) హావ్ డా- సంబల్ పుర్ ఎక్స్ ప్రెస్ (203831) సంత్రగాచి-పూరీ ఎక్స్ ప్రెస్ (02837

ఇక బెంగళూరు -గువాహటి (12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్ళించారు. ఖరగ్పూర్ డివిజన్ లో ఉన్న చెన్నై సెంట్రల్-హావ్ డా (12840) రైలును జరోలీ మీదుగా, వాస్కోడిగామా-షాలిమార్ (18058), సికింద్రాబాద్- షాలిమార్ (22850) వారాంతపు రైళ్లను కటక్ అంగోలు మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం నేపథ్యంలో.. గోవా ముంబై వందే భారత్ రైలు ప్రారంభం వాయిదా పడింది. మడ్గావ్ స్టేషన్ నుంచి ప్రారంభించాల్సిన గోవా ముంబై వందే భారత్ రైలు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లుగా కొంకన్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం ఉదయం ప్రధాని మోదీ వెర్చువల్ పద్ధతిలో ఈ రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement