Tuesday, November 26, 2024

Good News | ఆకాశ ఎయిర్‌ పైలట్లకు.. 40 శాతం వేతనాలు పెంపు

ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా స్థాపించిన ఆకాశ ఎయిర్‌ పైలట్లకు 40 శాతం వరకు వేతనాలు పెంచింది. విమానాల కనుగోలు కోసం సంస్థ రికార్డ్‌ స్థాయిలో ఆర్డర్లు పెట్టింది. కొవిడ్‌ సమయంలో వేతన కోతలతో పాటు, చాలా మంది విమానయాన సిబ్బంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం విమాన ప్రయాణికులు గణనీయంగా పెరిగారు. ఈ రంగం కొవిడ్‌కు పూర్వ స్థితికి చేరుకుంది. అన్ని విమాయాన సంస్థలు సిబ్బంది వేతనాలు పెంచడంతో పాటు, కొత్త విమనాలకు ఆర్డర్లు ఇస్తున్నాయి.

ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నందున విమాన సర్వీస్‌లను పెంచుకునేందుకు అన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే పైలట్లు సంస్థను వీడకుండా నివారించేందుకు వారికి భారీగా వేతనాలు పెంచాలని ఆకాశ ఎయిర్‌ నిర్ణయించింది. ఎయిర్‌ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు వందల సంఖ్యలో కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. మరో వైపు గల్ఫ్‌ దేశాలకు చెందిన పలు విమాన సంస్థలు కూడా సర్వీస్‌లు పెంచుకునేందుకు సిబ్బంది నియామకాలు జరుపుతున్నాయి. ఈ స్థితిలో పైలట్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఫలితంగా అన్ని సంస్థలు వీరి వేతనాలు పెంచుతున్నాయి. సర్వీస్‌లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న గోఫస్ట్‌ కూడా ఇటీవలే అదనంగా పైలట్లకు లక్ష రూపాయల వేతనం పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement