Thursday, November 21, 2024

అగ్ని ప్రమాదంలో 40 ఇండ్లు దగ్ధం.. నిలువనీడ కోల్పోయిన గిరిజన కుటుంబాలు

మంగపేట, ప్రభన్యూస్‌ : ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహసాగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన శనిగకుంటలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో సుమారు 40 ఇండ్లు కాలిపోయాయి. దీంతో గిరిజన కుటు-ంబాలు నిలువ నీడ లేకుండా, కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. ఇందుకు సంబందించి గ్రామస్థులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో వీచిన గాలి దుమారంకు శనిగకుంట గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం, పొలాల వైపు నుండి మంటలు శనిగకుంట గ్రామంలోకి వ్యాపించాయి. దీంతో మంటలు గ్రామంలోని ఇండ్లకు అంటుకోవడం, ఇండ్లలోని గ్యాస్‌ సిలెండర్లు సైతం పేలడంతో పెద్దల నర్సయ్య, పసుల గడ్డయ్య, తోలెం మునెమ్మ, తోలెం చంద్రమ్మ, మంకిడి రాంబాబు, మంకిడి వీరయ్య, తోలెం సమ్మయ్య, మేసు లక్ష్మి, తోలెం రాంబాబు, ఎట్టి సమ్మయ్య, తోలెం సుధాకర్‌, తోలెం నాగబాబు, తోలెం నర్సయ్య, ఎట్టి బోడమ్మ, తోలెం లక్మయ్య లకు చెందిన ఇండ్లతో పాటు సుమారు 40 ఇండ్లు అగ్నికి ఆహుతి కావడంతో గిరిజన కుటు-ంబాలు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. ఒక వైపు గాలి దుమారం, కరెంట్‌ లేకపోవడం, మరోవైపు గ్రామంలో పెద్ద త్తున ఇండ్లు కాలిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక గిరిజన కుటు-ంబాలు అల్లాడిపోయాయి. అగ్ని ప్రమాదం వలన ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరుగగా, ప్రాణ నష్టం మాత్రం జరగలేదని తెలుస్తుంది. రాత్రి వేళ కావడం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, గాలి దుమారం కావడంతో పూర్తి వివరాలు శుక్రవారం ఉదయం కానీ తెలిసే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదంలో సర్వం కాలిపోవడంతో నిలువనీడ కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement