Wednesday, October 2, 2024

Bullets : నటుడి బ్యాగులో 40 బులెట్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు

కోలీవుడ్ సీనియర్ న‌టుడు మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ను త‌మిళ‌నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అత‌డి బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. తిరుచ్చి వెళ్లేందుకు నేడు ఉద‌యం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు కరుణాస్‌. ఈ క్ర‌మంలోనే అతడిని భద్రతా బలగాలు సోదాలు చేశాయి.

త‌న‌తో తీసుకువ‌చ్చిన బ్యాగ్‌ను చెక్ చేయ‌గా.. ఆ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. దీంతో హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న‌ 40 బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయన ప్రయాణాన్ని రద్దు చేశారు. భద్రతా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement