తైవాన్‌కు చెందిన ఎవర్ గ్రీన్ మెరైన్ కార్పోరేషన్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారీ స్థాయిలో బోనస్‌లు ప్రకటించింది. ఈ కంపెనీ ఏకంగా నాలుగు సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ఇస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. తైవాన్‌కు చెందిన ఈ షిప్పింగ్ సంస్థ 50 నెలల జీతంతో సమానమైన బోనస్ ఇస్తోంది. ఇంది నాలుగు సంవత్సరాల జీతం కంటే ఎక్కువ. ఉద్యోగి జాబ్ గ్రేడ్, తైవాన్ ఆధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఒక ఏడాదిలో సంస్థ, ఉద్యోఇ పనితీరు మీద ఆధారపడి సంవత్సరాంతపు బోనస్‌లు ఉంటాయని ఎవర్గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. వివరాలు మాత్రం వెల్లడించలేదు.
గత రెండు సంవత్సరాల్లో ఎవర్ గ్రీన్ వ్యాపారం భారీ స్థాయిలో పెరిగింది. 2022లో ఆదాయం 20.7 బిలియన్ డాలర్లకు పెరిగిందని అంచనా. 2020తో పోల్చుకుంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. మొత్తం ఉద్యోగులకు బోనస్ ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు.. గత సంవత్సరం ఈ సంస్థ పేరు ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది. ఈ కంపెనీ నౌక ఈజిప్ట్‌లోని సూయిజ్ కాలువలో అనూహ్యంగా ఇరుక్కుపోయింది. ప్రపంచ వాణిజ్యంలో ఎంతో కీలకమైన సూయిజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుకవడంతో వేల కోట్ల డాలర్ల నష్టం జరిగంది.