గుజరాత్ టైటాన్స్ జట్టు తన ప్రత్యర్థి లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించకపోవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ముందు కేవలం 136 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంది. అయితే.. గుజరాత్ బ్యాటర్లతో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (47, 6 ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (66, 4 సిక్సులు, 2 ఫోర్లు) మాత్రమే రాణించారు.
కానీ, ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ని లక్నో జట్టు చేజేతులారా పోగొట్టుకుంది. తక్కువ స్కోరే కదా.. సునాయసంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ, గుజరాత్ బౌలర్ల దెబ్బకు లక్నో బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. 128 పరుగులు మాత్రమే చేశారు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టిన గుజరాత్ తన బౌలింగ్ సత్తానికి చాటుకుంది. ఏడు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది..