హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్ సెకండియర్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షను రాశారు. అయితే నాలుగు మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. కరీంనగర్లో 3, వరంగల్‌లో ఒక కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. మొత్తం 4,34,862 మంది విద్యార్థులకుగానూ 4,20,195 మంది విద్యార్థులు హాజరు కాగా, 14,667 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వెల్లడించారు. సెట్-బి ప్రశ్నపత్రాన్ని విద్యార్థులకు అందించినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement