Tuesday, November 26, 2024

బొగ్గు పరిశ్రమలో 2035 నాటికి 4 లక్షల ఉద్యోగాల కోత

అంతర్జాతీయంగా బొగ్గు పరిశ్రమలో 2035 నాటికి 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కోతకు గురవుతాయని అమెరికాకు చెందిన ఎన్‌జీఓ సంస్థ గ్లోబల్‌ ఎనర్జీ మానిటర్‌ తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా ఈ ఉద్యోగాలు కోల్‌ మైనింగ్‌లోనే ఎక్కువగా కోతకు గురవుతాయని తెలిపింది. సగటున రోజుకు వంద మంది ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. వాతావరణ పరిరక్షణ వాగ్ధానాలు, బొగ్గును దశలవారిగా నిర్మూలించాలన్న విధానాలు లేకున్నా చైనా, భారత్‌ ఎక్కువగా దెబ్బతింటాయని నివేదిక పేర్కొంది.

చౌకగా లభించే పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. చైనాలోని షాన్షి ప్రావిన్స్‌లో 2050 నాటికి అత్యధికంగా 2,41,900 ఉద్యోగాల కోతలు ఉంటాయని అంచనా వేసింది. భారత్‌లోని కోల్‌ ఇండియాలో 73,800 ఉద్యోగాలు కోత పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంఆ ఉన్న 4,300 క్రియాశీల, ప్రతిపాదిత బొగ్గు గునులు, ప్రాజెక్ట్‌లు అంతర్జాతీయ బొగ్గు ఉత్పత్తిలో 90 శాతానికి పైగా బాధ్యత వహిస్తున్నాయని నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement