Saturday, September 7, 2024

సాంస్కృతిక వారసత్వ కళారూపాల జాబితాలో ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 1 అంశానికి చోటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో సాంస్కృతిక వారసత్వాన్ని, భిన్న సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ‘ఇంటాన్జిబుల్ కల్చరల్ హెరిటేజ్ (ఐసీహెచ్)’ పథకాన్ని 2013 నుంచి అమలు చేస్తున్నామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఐసీహెచ్ పథకానికి ‘సంగీత్ నాటక్ అకాడమీ’ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 300 ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు వెల్లడించారు.

‘నేషనల్ ఇన్వెంటరీ ఆఫ్ ఇంటాన్జిబుల్ కల్చరల్ హెరిటేజ్’ పేరుతో రూపొందిచిన సాంస్కృతిక వారసత్వ కళారూపాల జాబితాలో దేశవ్యాప్తంగా 165 కళారూపాలున్నాయని, అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 4, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకటి చోటు దక్కించుకున్నాయని తెలిపారు. జాబితాలో చోటుదక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ కళారూపాల్లో కిన్నర వీణ, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, వీరగాథ ఉండగా, తెలంగాణకు చెందిన కళారూపం చిందు భాగవతానికి ఈ జాబితాలో చోటు దక్కిందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement