-ఇన్నోవేషన్- -ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ – ఇన్‌క్లూసివ్ గ్రోత్
సీఎం కేసీఆర్ హయాంలో సంస్కరణలకు స్వర్ణయుగం
గూగుల్‌కు గుండెకాయ, అమెజాన్‌కు ఆయువుపట్టు… ఫేస్‌బుకకేే ఫేవరేట్ డెస్టినేషన్ భాగ్యనగరం
కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు
ఇవాళ తెలంగాణలో జరిగేది.. రేపు దేశంలో జరుగుతోంది
తెలంగాణ ఫస్ట్ ఇన్ సేఫ్టీ.. బెస్ట్ ఇన్ సెక్యూరిటీ
పరిపాలన సంస్కరణల తీర్మానంపై ప్లీనరలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఃత్రీ ఐః మంత్రా నడుస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. 75ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన సమావేశంలోనూ ఇదే విషయం చెప్పానని గురు ్తచేశారు. ఃఃత్రీ ఐ అంటే… ఇన్నోవేషన్, ఇన్‌ఎఅ్టాస్ట్రక్చర్, ఇన్‌క్లూ సివ్ గ్రోత్‌ఃః అని వివరించారు. ఈ మూడింటినీ దేశవ్యాప్తంగా అమలు చేస్తే కచ్చితంగా నయా భారత్‌ను కొత్త తరానికి అందించొచ్చని ప్రధాని మోడీకి సూచించినట్లు పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏడేళ్ల పాలన తెలంగాణలో సంస్క రణలకు స్వర్ణ యుగమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడున్న రేళ్ల ప్రస్థానంలో తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలన స్వర్ణ యు గాన్ని తెచ్చింది. ధరణి ఒక సంచలనమని, దేశానికే ది క్సూ చిగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్క రణలు… ఇతర రాష్ట్రాలకే కాదు.. దేశానికే దిక్సూచిగా నిలుస్తు న్నా యన్నారు. ఃఃటీఆర్‌ఎస్ తెచ్చిన ప్రతి చట్టం తెలంగాణ ప్రజలకు చుట్టం. కేసీఆర్ అంటే… కాలువలు, చెరువులు, రిజ ర్వా య ర్లుఃః అని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో ఃఃపరి పాలనా సస్కరణలు, విద్యుత్, పారిశ్రామిక, ఐటీ రంగాల అభి వృద్ధి, మౌళిక వసతుల కల్పన.ఃః తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు.
గతంలో ఐటీకి హైదరాబాద్ బ్యాక్ ఆఫీస్‌గా ఉండేదని, అయితే నేడు టీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం గూగుల్‌కు గుండెకాయ, అమెజాన్‌కు ఆయువుపట్టు లాంటిదని ప్రకటించారు. ఫేస్‌బుక్‌కు ఫస్ట్ ఫేవరేట్ డెస్టినేషన్ హైదరాబాద్ అని చెప్పారు. కట్టుకథలకు పెట్టుబడులు రావని గత ప్రభు త్వాలకు హితవు చెప్పారు. ఃఃపరిశ్రమలంటే టాటా, బిర్లాలు కాదు. కులవృత్తులు కూడా కుటీర పరిశ్రమలేనని స్పష్టం చేశా రు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావని, ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కరించారని, అయితే ఇప్పుడు టీఎస్ బీపాస్‌తో తెలంగాణకు కంపెనీలు క్యూ కట్టాయన్నారు. తయారీ రంగ పరిశ్రమలో తె లంగాణకు ఎదురులేదని, ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. టీకాల ఉత్పత్తిలో ప్రపం చానికి రాజధానిగా మారామని తెలి పారు. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్రగా మారిందన్నారు.
గతంలో ఃఃఈ రోజు బెం గాల్ ఆలోచించేది… రేపు దేశం ఆలోచిస్తుంది అనే నానుడు వాడు కలో ఉండేదని, అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయ కత్వంలో ఇవాళ తెలంగాణలో జరిగేది… రేపు దేశ వ్యాప్తంగా జరుగు తుందిఃః అనేలా సగర్వం గా తెలంగాణ విజయ ప్రస్ధానం కొనసాగిస్తోందన్నారు. సంక్షేమ పథకాలతోపాటు సంస్కరణ ఫలాలూ ప్రజలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
కొత్త రాష్ట్రాన్ని సాధించడంతోపాటు అధికార వికేంద్రీ కరణ ఫలాలు ప్రజలకు అందాలనే సంకల్పంతో సరికొత్తగా పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించామ న్నారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేశా మన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు, విధులతో ప్రతి పల్లె ఆదర్శ పల్లెగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా గుర్తించి అవార్డులు ఇస్తోందని చెప్పారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పోలీసు కమిష నరేట్లను తొమ్మిదికి పెంచా మన్నారు. దేశంలోనే లా అండ్ ఆర్డర్‌లో తెలంగాణ ఫస్ట్ ఇన్ సేఫ్టీ… బెస్ట్ ఇన్ సెక్యూ రిటీ అనే విధంగా పేరు తెచ్చుకుందన్నారు. ధరణి పోర్టల్‌తో భూ రికార్డుల ప్రక్షాళన మొద లు పెట్టిందన్నారు. త్వర లోనే సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామన్నారు. అక్షాంశాలు, రేఖా ంశాలతో భూమిని గుర్తించి, పాస్ పుస్తకాలు అంద జయ ను న్నట్లు చెప్పారు. నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోం దన్నారు.
ఎన్నో సంస్కరణలు
గడిచిన ఏడేళ్లలో సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో రకాల పరిపాలనా సంస్కరణలు తెలం గాణలో ఆవిష్కృతమ య్యా యన్నారు. పాల కుల, అధికారుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధి కారాన్ని ప్రజల చేతికి అందించామని, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదలకు అందుతున్నా యన్నారు. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకలించామన్నారు. ఈ ఆశయ సాధన దిశగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలం గా ణలో ఎన్నో సంస్కరణలతో కూడిన సు వర్ణ అధ్యాయాలు నమోదవుతున్నాయన్నారు. అం దులో మొ దటిది సమగ్ర కుటుంబ సర్వే అని తెలిపారు. పరి పాలనా సం స్కరణలకు ప్రాణాధారం సరైన సమాచారం అని… ప్రజలకు చెందిన సమాచారాన్ని ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలుసుకుందన్నారు. అధికారం చేపట్టిన కొద్ది రోజ ుల్లోనే సమగ్ర కుటుంబ సర్వే యజ్ఞా నానికి శ్రీకారం చుట్టామన్నారు. ఒక్క రోజులోనే దేశం అబ్బు రపడేలా తెలంగాణ ప్రజల బతుకు చిత్రాలను గణం కాలతో సహా సేకరించి సంచలనం సృష్టిం చినట్లు వివరించారు.
తెలంగాణ స్టార్టప్.. కేంద్రం ప్యాకప్
టీఎస్ బీపాస్ ద్వారా తెలంగాణకు పరి శ్ర మలు , పెట్టుబడులు తరలివస్తున్నా యని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త స్టార్టప్‌లు, పరిశ్రమల ఏర్పాటుతో తెలంగాణ స్టార్టప్ అంటుంటే… కేంద్ర ప్రభు త్వం ప్యాకప్ అంటోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని మోదీ ప్రభు త్వం తెగనమ్ముతోందని, ప్రయి వేటుపరం చేస్తోందని దుయ్యబట్టారు.