దేశంలో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల విలువ 2022లో 5.7 శాతం పెరిగాయి. ఇవి ప్రస్తుతం 39.88 లక్షల కోట్లకు చేరాయి. నెలవారీ క్రమానుగత పెట్టుబడులు(ఎస్‌ఐపీ-సిప్)ల్‌ల స్థిరవృద్ధే అందుకు దోహదం చేసిందని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సమాఖ్య(ఏఎంఎఫ్‌ఐ) తెలిపింది. 2021లో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఆస్తుల విలువ 22 శాతం (7లక్షల కోట్లు) పెరిగాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత వాతావరణం, వడ్డీరేట్లు పెరగడం వంటి కారణాలతో 2022లో మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు తగ్గాయని ఏఎంఎఫ్‌ఐ (యాంఫీ) తెలిపింది. ఇన్వెస్టర్లు తమ నిధులను ఈక్విటీ, డెట్, హౖౖెబ్రిడ్ పథకాల మధ్య పదే పదే తరలించారని పేర్కొంది. 2021లో స్టాక్‌మార్కెట్‌లో వచ్చిన ర్యాలీ ఎంఎఫ్‌లతో గణనీయ వృద్ధికి దోహదం చేసింది.
2022లో స్టిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్స్(ఎస్‌ఐపీ-సిప్)లో స్థిరవృద్ధి నమోదైంది. నవంబర్‌లో రి కార్డ్ స్థాయిలో 13 వేల కోట్లు ఇన్వెస్టర్లు మదుపు చేశారు. ఏడాది మొత్తంలో నెలవారీ సగటు సిప్‌ల విలువ 12,500 కోట్లుగా నమోదైంది. యాంఫీ కూడా ప్రజల్లో మ్యూచువల్ ఫండ్లపై అవగాహన పెంచడం కోసం విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించింది. 2023లోనూ సిప్‌ల హవా కొనసాగుతుందని యాంఫీ అంచనా వేస్తోంది. 2022లో అత్యధికంగా ఎంఎఫ్ ఈక్విటీ పథకాల్లో మదుపర్లు 1.61 లక్షల కోట్ల నిధులను మళ్లించారు. తరువాత ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్‌ల్లో 1.65 లక్షల కోట్లు మదుపు చేశారు. అదే సమయంలో డెట్ పథకాల నుంచి 2.5 లక్షల కోట్లు ఉపసంహరించుకున్నారు.