జమ్మూకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతోన్న తొలి అసెంబ్లీ సమావేశాల్లో రసాభాస జరిగింది. ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ బ్యానర్ ను ప్రదర్శించడమే ఈ దాడికి ప్రధాన కారణమైంది. ఖుర్షీద్ అహ్మద్ చేసిన పనిపై బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం తెలుపగా.. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఎమ్మెల్యేలంతా ఒకరిపై మరొకరు పిడిగుద్దులతో దాడులు చేసుకున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు జాతి వ్యతిరేక శక్తులకు ఆశ్రయమిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా ఆరోపించారు. కాంగ్రెస్ పాక్ తో చేయి కలిపిందని, ఉగ్రవాదంతో చేయి కలిపిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.