సెర్బియా: ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. గత ఏడేళ్లుగా అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడిగా కొనసాగుతున్న జకో పురుషుల టెన్నిస్‌లో సుదీర్ఘకాలం నంబర్‌వన్ స్థానంలో కొనసాగిన ఆటగాడిగా దూసుకుపోతున్నాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ 350వారాలుగా నంబర్‌వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అమెరికా టెన్నిస్ దిగ్గజం పీట్‌సంప్రాస్ ఆరేళ్ల నంబర్‌వన్ రికార్డును ఇంతకుముందే అధిగమించాడు. ఈ ఏడాది మార్చిలో స్విస్ దిగ్గజం ఫెదరర్ 310వారాల రికార్డును జకో బ్రేక్ చేశాడు. అయితే మహిళా టెన్నిస్ దిగ్గజం స్టెఫీగ్రాఫ్ 377వారాలపాటు రికార్డుస్థాయిలో నంబర్‌వన్‌గా కొనసాగింది.
మరో 27వారాలు జకో తన నంబర్‌వన్ స్థానాన్ని పదిలపరుచుకుంటే టెన్నిస్‌లో ఆల్‌టైమ్ రికార్డు అతడి పేరిట నమోదవుతుంది. ఏటీపీ టోర్నీ 2022లో ఆడనున్న జకోవిచ్ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్ వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఏటీపీ కప్ 2022లో సెర్బియా తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనకపోవచ్చనని జకో వార్తల్లోకి ఎక్కాడు. కొవిడ్ టీకా వేయించుకున్నది లేనిది తెలిపేందుకు ఇష్టపడక జకో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ మెల్‌బోర్న్‌లో జరగనుంది. అక్కడ ఆడాలంటే క్రీడాకారులందరూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించారు. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌కు జకో దూరంగా ఉండనున్నాడు. కానీ ఏటీపీ టోర్నీలో పాల్గొనేందుకు ఎటువంటి నిబంధనలు లేవు. ఈనేపథ్యంలో ఏటీపీ టోర్నీలో టాప్‌సీడ్ జకోవిచ్ ఆడనున్నాడు.