Tuesday, November 19, 2024

కేటుగాడు: ఉంగరాలు మింగేసిన దొంగ!

కర్ణాటకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి 35 గ్రాముల బంగారాన్ని మించేశాడు. పోలీసులకు ఆధారాలు దొరకరాదని దొంగిలించిన బంగారు ఉంగరాలను మింగిన దొంగకు డాక్టర్లు ఆపరేషన్‌ చేసి 35 గ్రాముల బంగారు ఉంగరాలు బయటికితీశారు. ఈ సంఘటన కర్ణాటక లో దక్షిణకన్నడ జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. మార్చి చివర్లో సుళ్య పాతబస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. రూ.7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ.50 వేలు నగదు దోచుకెళ్లారు. ఈ కేసులో పోలీసులు ఐదురోజుల కిందట తంగచ్చయన్‌ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఎవరికీ తెలియకుండా శిబు తన వద్ద గల 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. అతనికి కడుపునొప్పి రావడంతో పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్‌రే తీయగా కడుపులో ఉంగరాలు ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు అతని పొట్ట కోసి 25 చిన్న చిన్న ఉంగరాలను తీశారు. ఈ ఆభరణాల్లో ఎక్కువగా చేతి ఉంగరాలు, చెవి పోగులు ఉన్నాయి. టిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  దొంగ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement