Thursday, November 21, 2024

దేశవ్యాప్తంగా 34వేల మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌

దేశవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కేసులు ఏటేటా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత రెండేళ్లలో లంగ్‌ క్యాన్సర్‌ కేసులు 5శాతం పెరిగాయని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి ప్రోగ్రాం, నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రాం డేటా వివరాలను కేంద్రం ప్రస్తావించింది. ఈ ఏడాది లంగ్‌ క్యాన్సర్‌ రోగులు 34వేల మంది మరణించారు. రెండు లక్షల కేసులతో యూపీ అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాలున్నాయి.

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో అత్యధిక కేసులు రికార్డయ్యాయి. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, కేరళ ఉన్నాయి. 40-64 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఐసీఎంఆర్‌ డేటా వెల్లడిస్తోంది. దేశంలో సగటున ప్రతి తొమ్మిది మందిలో ఒకరు లంగ్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 2025 నాటికి ఈ రోగుల సంఖ్య 12.8 శాతం పెరిగే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement