కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ విధుల్లో మహిళల పనితీరు భేషుగ్గా ఉందని పేర్కొంది. ప్రస్తుతం కర్ణాటకలో 4.6లక్షల మంది ఉద్యోగులు, 1.5లక్షల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేస్తే 50వేల ఉద్యోగాలు స్త్రీలకు లభించనున్నాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ప్రభుత్వ శాఖలతోపాటు, అన్ని వర్శిటీలు, పట్టణ స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లల్లోనూ వర్తిస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..