Thursday, November 21, 2024

చైనాలోని ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం – 32 మంది రోగులు సజీవ దహనం

చైనా రాజధాని బీజింగ్‌లోని ఆసుపత్రిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 32 మంది చనిపోయారు. మరో 71 మందికి పైగా గాయపడ్డారు. మంటల్లో కాలిపోవడంతో పలువురు రోగులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12.57 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు చాలా శ్రమ తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అప్పటికే 32 మంది రోగులు సజీవ దహనమయ్యారు. మిగిలిన 71 మంది రోగులను రక్షించిన ఆసుపత్రి నుంచి మరొక ప్రదేశానికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement