Friday, November 22, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 319 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అధికారులు దరఖాస్తులను కోరుతున్నారు. ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికెట్ కలిగి ఉన్నవారిని అర్హులుగా పేర్కొన్నారు. 2020, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు గల వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక విధానం ఉంటుందని పేర్కొన్నారు. 150 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఈనెల 17లోగా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. వెబ్‌సైట్‌: www.vizagsteel.com.

దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అభ్యర్థులు నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వెల్డర్, కార్పెంటర్, మెకానిక్ డీజిల్, కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్స్ కు సంబంధించి నెలకు రూ.7,700 స్టైఫండ్ ఇస్తారు. ఇతర ట్రేడ్స్ కు సంబంధించి నెలకు రూ.8,050 స్టైఫండ్ ఇస్తారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఫిట్టర్‌-75, టర్నర్‌-10, మెషినిస్ట్‌-20, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌)-40, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌-20, ఎలక్ట్రీషియన్‌-60, కార్పెంటర్‌-20, మెకానిక్‌ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌కండిషనింగ్‌-14, మెకానిక్‌ డీజిల్‌-30, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌-30.

ఇది కూడా చదవండి: ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు 24 శాతం పీఎఫ్ కేంద్రమే భరిస్తుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement