సరిహద్దు దాటిన నార్కోటిక్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లకు వ్యతిరేకంగా పంజాబ్ పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీలు మరియు బిఎస్‌ఎఫ్‌తో సంయుక్త ఆపరేషన్‌లో 31.02 కిలోల బరువున్న 29 హెరాయిన్ ప్యాకెట్లతో ఒక ఆర్మీ అధికారి, అతని సహాయకుడిని అరెస్టు చేసినట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు. 26 సంవత్సరాల ఆర్మీ మ్యాన్‌ను పఠాన్‌కోట్‌లో సిపాయిగా విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఫజిల్కాలోని మహలం గ్రామానికి చెందిన అతని సహాయకుడు పరమజీత్ సింగ్ అలియాస్ పమ్మాతో కలిసి దందా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వెంటనే అతన్ని అరెస్టు చేసినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. నిందితుల నుంచి యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ గల కారు, రెండు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.