Tuesday, November 26, 2024

Kia Cars | 30వేల కియా కరెన్స్‌ కార్ల రీకాల్‌.. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కోసమని కంపెనీ ప్రకటన

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ కియా ఇండియా 30,297 కరెన్స్‌ మోడల్‌ కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డెట్‌ కోసం వీటిని వెనక్కి పిలిపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 2022 సెప్టెంబర్‌ నుంచి 2023 ఫిబ్రవరి మధ్య తయారైన యూనిట్లకు ఇలా రీకాల్‌ చేస్తున్నది. ఈ రీకాల్‌లో భాగంగా క్లస్టర్‌ బూటింగ్‌ ప్రక్రియలో ఏదైనా సమస్య ఉంటే ఉచితంగానే సాఫ్ట్‌వేర్‌ అప్‌డెట్‌ చేసి ఇస్తామని కంపెనీ ప్రకటించింది.

లేకుంటే క్లస్టర్‌ పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని తెలిపింది. రీకాల్‌ ప్రక్రియలో భాగంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామని, వారికి వ్యక్తిగతంగానూ సమాచారం అందిస్తామని కంపెనీ ఆ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్‌ అపాయింట్‌మెంట్స్‌ కోసం ఆథరైజ్డ్‌ డీలర్లను వినియోగదారులు సంప్రదించాల్సి ఉంటుందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement