1991, జూలై 18న విడుదలైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ సంచలన విజయం సాధించింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందించారు. బాలకృష్ణ, మోహిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ వీడియోను విడుదల చేసింది.
అయితే ఈ సినిమాకు పునాది పడేందుకు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కారణమని హీరో బాలకృష్ణ వెల్లడించారు. ఓ సందర్భంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన మనసులో ఉన్న ట్రైమ్ ట్రావెల్ లైన్ గురించి బాలుకి చెప్పారు. ఎస్పీబీ ఎగ్జయిట్ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే… ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ‘ఆదిత్య 369’చిత్రాన్ని ఈ రోజులకు కూడా అన్వయించుకునేలా ఉంటుంది. ఈ మూవీ ఇప్పటికీ డిజిటల్ మీడియాలో ఆదరణ పొందుతుండటం గర్వకారణంగా ఉందని బాలయ్య తెలిపారు. త్వరలో‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ వార్త కూడా చదవండి: డిసెంబరులో విడుదల కానున్న ‘పుష్ప’