Friday, November 22, 2024

కోళ్ల పరిశ్రమ ఆదాయంలో 30 శాతం వృద్ధి..

మన దేశంలో కోళ్ల పరిశ్రమ ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరంలో30 శాతానికి పైగా వృద్ధి తో 2.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని క్రిసిల్‌ నివేదక అంచనా వేసింది. గిరాకీ స్థిరంగా వృద్ధి చెందుతుండటంతో ఆదయం పెరుగుతుందని, మరో వైపు కోళ్ల దాణా, ఇతర నిర్వాహణ ఖర్చలు పెరగడంతో లాభాలు తగ్గవచ్చని తెలిపింది. కోవిడ్‌ ప్రభావంతో రెండు సంవత్సరాలుగా కోళ్ల పరిశ్రమ పెద్దగా విస్త్రరణ జరగలేదని తెలిపింది. 2020-21తో పోలిస్తే,2021-22 సంవత్సరంలో మాంసం వినియోగం 5 శాతం, గుడ్ల వినియోగం 4 శాతం మాత్రమే పెరిగాయి. 4.3 లక్షల టన్నుల మాంసం, 12 వేల కోట్ల గుడ్లను దేశీయంగా వినియోగించారని నివేదిక వెల్లడించింది.

పెరిగిన గిరాకీ..

పెరుగుతున్న జనాభా, అధిక తలసరి వినియోగం, కోవిడ్‌తో పర్‌టీన్‌ రిచ్‌ ఆహారానికి ప్రాధాన్యత పెరగడంతో కోళ్ల ఫామ్‌లు పూర్తి సామర్ధ్యంతో నిర్వహిస్తున్నాట్లు క్రిసిల్‌ తెలిపింది. గృహ వినియోగంతో పాటు, హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌ల్లో చికెన్‌కు డిమాండ్‌ పెరగడంతో బ్రాయిలర్‌ కు టోకు ధర అధికంగా లభిస్తున్నట్లు తెలిపింది. బ్రాయిలర్‌ కోడి మాంసం ఈ ఆర్థిక సంవత్సరం సరాసరిన 130 నుంచి 140 రూపాయల వరకు ఉండొచ్చని పేర్కొంది. గత సంవత్సరంలో ఇది 104 రూపాయిలుగా ఉంది. కోళ్లకు అందించే మొక్కజొన్న, సోయామీల్‌ వంటి ప్రధాన దాణా వ్యయాలు సరఫరా సమస్యలతతో సుమారు 35 శాతం పెరిగాయని క్రిసిల్‌ తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ దాణా రేట్లు తగ్గే అవకాశంలేదని అంచనా వేసింది. డిమాండ్‌ పెరుగుతున్నందున ఈ సంవత్సరం పౌల్ట్రిd ఫామ్‌లన్నీ పూర్తి సామర్ధ్యంతో నడిచే అవకాశం ఉందని క్రిసిల్‌ తెలిపింది. ఇందుకు మూడు నుంచి ఆరు నెలల కాలం పడుతుందని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement