Saturday, November 23, 2024

Rahul Gandhi | 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయాత్ర లో భాగంగా ఇవ్వాల‌ రాజస్థాన్‌లో అడుగుపెట్టగా, బన్స్వారాలో జరిగిన ఓ సభలో రాహుల్ మాట్లాడుతూ… ’25 ఏళ్లలోపు వారికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తాం అని తెలిపారు.

ఉద్యోగ నియామక ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు చట్టం తీసుకువస్తామని.. స్టార్టప్‌లకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధులతో లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. దేశంలో రైతులు చెల్లించే కనీస మద్దతు ధరకు న్యాయపరమైన హామీ ఉంటుందన్నారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తాం అని రాహుల్ గాంధీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement