Saturday, November 23, 2024

CBSE | సోషల్‌ మీడియాలో 30 సీబీఎస్‌ఈ ఫేక్‌ ఖాతాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ బోర్డు విద్యార్థులకు కీలక హెచ్చరికలు జారీచేసింది. సామాజిక మాధ్యమాల్లో సీబీఎస్‌ఈ లోగో..పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే నకిలీ హ్యాండిల్స్‌తో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సోషల్‌ మీడియా ట్విట్టర్‌ (ఎక్స్‌)లో సీబీఎస్‌ఈ బోర్డు పేరుతో 30 వరకు నకిలీ ఖాతాలు ఉన్నాయని తెలిపింది.

వాటిని ఫాలో కావొద్దని సూచించింది. తమ అధికారిక ఖాతా నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. తమ బోర్డు పేరు, లోగో పెట్టుకొని విద్యార్థులు, పేరెంట్స్‌కు తప్పుదోవ ట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. నకిలీ ఖాతాల్లో వచ్చిన సమాచారానికి తమది బాధ్యత కాదని ఈమేరకు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement