Thursday, November 21, 2024

30ఎముక‌లు విరిగాయ్.. హాస్ప‌ట‌ల్ నుండి డిశ్చార్జ్ అయ్యా.. హాలీవుడ్ హీరో

రీసెంట్ గా కారు ప్ర‌మాదానికి గుర‌య్యారు హాలీవుడ్ స్టార్ హీరో జెరేమీ రెన్న‌ర్. కాగా ఈ ప్రమాదంలో తన దేహంలోని 30 ఎముకలు విరిగిపోయాని చెప్పారు. తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యానని, ఇప్పుడు ఇంట్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నానని తెలిపారు. ఒక విషాదకర సందర్భం నుంచి తాను, తన ఫ్యామిలీ తొందరగానే బయటపడ్డామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒంట్లో 30 ఎముకలు విరిగినా అభిమానులు, కుటుంబసభ్యులు, మిత్రుల ఆశీర్వాదంతోనే త్వరగా కోలుకున్నానని పేర్కొన్నారు. జెరేమీ రెన్నర్‌ ఈ ఏడాది జనవరి 1న తన ఇంటిముందు మంచులో ఇరుక్కుపోయిన బంధువు కారును వెలికితీసే ప్రయత్నంతో తీవ్రంగా గాయపడ్డాడు. కారుపై మంచును తొలగించి బయటికితీయబోయి ఆయన జారిపడ్డాడు. ఈ ఘటనలో రెన్నర్‌ ఛాతికి, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి మెరుగుపడటంతో ఇప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement