భారత్‌కు చెందిన యువ వృత్తి నిపుణులకు ఏటా 3 వేల వీసాలు ఇవ్వడానికి బ్రిటన్ అంగీకరించింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్‌తో ప్రధాన మంత్రి మోదీ భేటీ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీమ్‌తో ప్రయోజనం పొందతున్న మొదటి దేశం భారత్ అని బ్రిటన్ అధికారులు తెలిపారు. యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్క్‌మ్‌లో భాగంగా 18-30 సంవత్సరాల వయస్సులోపు ఉన్న యువ విద్యావంతులు బ్రిటన్‌లో రెండు సంవత్సరాల పాటు ఉండేందుకు, ఉద్యోగం చేసుకునేందుకు ఈ వీసాలు ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ తెలిపారు. జీ20 దేశాల సమావేశం సందర్భంగా రెండు దేశాల ప్రధాన మంత్రులు పలు అంశాలపై చర్చలు జరిపారు.
ఈ స్కీమ్ వల్ల రెండు దేశాల మధ్య దౌపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఇతర దేశాల కంటే భారత్, బ్రిటన్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయి. ఏటా మన దేశం నుంచి వేలాది మంది విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళుతున్నారు. మన దేశానికి చెందిన ఇంజినీర్లు, డాక్టర్లు, కార్పొరేట్ రంగంలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, వృత్తి నిపుణులు పని చేస్తున్నారు.
వాణిజ్య ఒప్పందంపై చర్చలు
ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండే దేశాల మద్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. ప్రస్తుతం రెండు దేశాల మద్య 24 బిలియన్ ఫౌండ్ల వాణ్యం జరుగుతోంది. ఈ ఒప్పందంపై బ్రిటన్ ప్రధాన మంత్రిలో చర్చలు జరిపినట్లు మోడీ తెలిపారు. భారత్‌లో వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు అంతకు ముందు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటలో తెలిపింది. భారత్ రక్షణ రంగంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చిందన, ఈ రంగంతో పాటు రెండు దేశాల మధ్య మరింత వాణిజ్య సంబంధాలు పెంచుకునేందుకు మంచి అవకాశం ఉందని ప్రధాన మంత్రి ట్విట్ చేశారు. సెక్యూరిటీ, శాంతియుత వాతావరణం లేకుంటే భవిష్యత్ తరాలు ఆర్ధిక పురోగతి ఫలాలను అందుకోలేవని మోడీ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మద్య మొబిలిటిపై 2021 మే లో అవగాహన ఒప్పందం కుదిరింది.