హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రముఖ భారత బహుళజాతి ఫెస్టిసైడ్ కంపెనీ …ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో మూడు నూతన పురుగు మందులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ” స్కైస్టార్, సాపర్, అలెక్టో ” పేర్లతో మూడు కొత్త పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. జపాన్‌కు చెందిన మిట్సూయి కెమికల్స్, ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఈ కొత్త పురుగుల మందులను తయారు చేశాయి. నూతనంగా తయారు చేసిన పురుగు మందుల ఉత్పత్తులను శుక్రవారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో నిర్వహించిన పంపిణీదారుల సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ఆగ్రో బిజినెస్ హెడ్ జీకే. వేణుగోపాల్, గ్రోత్ ఆఫీస్ హెడ్ కోషాల్ బైసెన్ మాట్లాడుతూ… స్కైస్టార్ వరి పంటలో వచ్చే సుడిదోమ, దోమపాటు నుంచి పంటను రక్షిస్తుందన్నారు. ఎకరానికి 133.2 గ్రాములను దోమను గుర్తించిన వెంటనే పిచికారి చేయాలన్నారు. ఇక సాపర్‌ను పత్తి పంటను ఆశించే రసం పీల్చే పురుగులు, , పచ్చదోమ, తెల్లదోమ, పేను బంక నివారణకు పంట శాఖీయ దశలో ఉన్నపుడు ఎకరానికి 250 గ్రాములను పిచికారి చేయాలన్నారు.
అలెక్టోను కూరగాయ పంటలను ఆశించే కీటకాలను నివారించేందుకు ఉపయోగించాలని సూచించారు. విత్తనం విత్తిన దగ్గర నుంచి పంట కోతకు వచ్చే వరకు ఎటువంటి సస్యరక్షణ సమస్యనైనా, ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలుగు రైతులకు తక్కువ ఖర్చుతో అందించేందుకు సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. తాజాగా విడుదల చేసిన పురుగు ముందు తెలంగాణ ప్రాంతంలో పండించే వరి, మిరప, పత్తి, కూరగాలయ పంటలల్లో మంచి ఫలితాలు తీసుకువచ్చి, నాణ్యమైన దిగుబడులను రైతులకు అందజేస్తాయని చెప్పారు. ప్రపంచంలోని 100కు పైగా దేశాల్లో ఇండోఫిల్ ఉత్పత్తులు వాడుకలో ఉన్నాయన్నారు. వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన నూతన ఉత్పత్తులను సంస్థ భారత రైతాంగానికి పరిచయం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మిత్సుయి కెమికల్స్ ఎండీ కన్యకటో, ఇండోఫిల్ ఉన్నతాధికారులు ప్రకాష్బోయర్, డా. ఎఎన్. చంద్రాని, మహేష్ ఖంబటె, అమిత్‌సింగ్, మిత్సుయి ప్రతినిధులు జిన్ కవాగుచి, ఎన్‌కె. సంగారెడ్డి, కట్సుయోషి టనావుల్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.