Tuesday, November 26, 2024

పంద్రాగస్టున మరో 3 హెల్త్‌ స్కీమ్‌లకు శ్రీకారం

దేశంలోని ప్రతిపౌరుడికి నాణ్యమైన వైద్యసేవలను అందుబాటు ధరలకు అందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 15న మూడు ఆరోగ్య పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ”పీఎం జన్‌ ఆరోగ్య యోజన”, ”ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌”, ”పీఎం ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాక్చర్‌ మిషన్‌”ను ఒకే పథకం ”పీఎం సమగ్ర స్వస్త్య యోజన” పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది. పంద్రాగస్టు ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేయనున్నారని అధికార వర్గాల సమాచారం. ”హీల్‌ బై ఇండియా” పేరుతో మరో పథకాన్ని కూడా ప్రధాని ప్రకటించనున్నారు.

ఈ పథకం కింద మన దేశ వైద్యులను ఏటా కొంత మందిని ఎంపిక చేసి విదేశాలకు పంపించి వారికి వివిధ చికిత్స విధానాలపై శిక్షణ ఇప్పించనున్నారు. ”హీల్‌ ఇన్‌ ఇండియా” అని మరో పథకాన్ని కూడా కేంద్రం ప్రకటించనుంది. భారత్‌లో మెడికల్‌ టూరిజాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని అధికార వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement