రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ సికింద్రాబాద్ లోని అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. అగ్నిమాపక డీజీ సంజయ్ జైన్, హైదరాబాద్ నార్త్ జోన్ డి.సి.పి. చందన దీప్తి, ఇతర అధికారులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికీ 3 లక్షల రూపాయలను ఎక్స్ గ్రేషియగా అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. ఘటనా స్థలంలో లాడ్జి ఉన్నందువల్ల వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని తెలియజేశారు.
చనిపోయిన వారిలో ఢిల్లీకి చెందిన రాజీవ్ మాలిక్, సందీప్ మాలిక్, వీరేంద్ర కుమార్, ఒడిశా రాష్ట్రం బాలాసోర్ కు చెందిన మిథాలి మహాపాత్ర, కటక్ కు చెందిన చందన్ జేతి, ఆంధ్ర ప్రదేశ్ విజయవాడకు చెందిన అల్లాడి హరీష్, చెన్నై నుండి సీతరామన్, యెన్. బాలాజీ లను గుర్తించారు. అగ్నిప్రమాదం తర్వాత దట్టమైన పొగ వ్యాపించడంతో వీరు ప్రాణాలు కోల్పోయారని ప్రాధమికంగా తెలిసిందన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.