జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున అవంతిపోరాలోని నాగ్‌బెరన్ ట్రాల్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహ్మద్ (జెఎమ్) ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా, శుక్రవారం అవంతిపోరాలోని క్రూ, పాంపోర్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఆయుధాలు,యు మందుగుండు సామగ్రితో సహా వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్త కూడా చదవండిః తెలంగాణలో ఇసుక బుకింగ్ నిలిపివేత..ఎప్పటివరకంటే