Wednesday, November 20, 2024

Maoist Letter | తునికాకు కట్టకు రూ.3.50 చెల్లించాలి.. లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

ఈ ఏడాది సీజన్​లో గ్రామీణులకు ఉపాధి కల్పించే.. తునికి ఆకు సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఒక్క కట్టకు రూ.3.50 చెల్లిం చాలని మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ మేరకు భద్రద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్​ కమిటీ ఆధ్వర్యంలో మీడియాకు అందిన లేఖలో పలు డిమాండ్లు చేశారు.  తునికి ఆకు సేకరణలో ఏటా గిరిజనులకు అన్యా యం జరుగుతోందని, ఒకవైపు ప్రభుత్వా లు, మరోవైపు కాంట్రాక్టర్లు ఆదివాసీలను మోసం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఆకు సేకరణ అన్ని ప్రాంతాల్లో జరగకుండా కొన్ని ప్రాం తాల్లో టెండర్లు పిలిచి మిగతా ప్రాంతాలను పక్కకుపెడుతున్నట్టు తెలిపారు. దీని మూలంగా వేసవిలో ఆకు సేకరణపై గ్రామీణ పేదలకు వచ్చే కొద్దిపాటి ఆదాయానికి ప్రభుత్వాలు గండికొడుతున్నా యని వెల్లడించారు. దీంతో గిరిజనులు పూర్తిగా నష్టపోతున్నా రని, ప్రజలతో సంబంధం లేకుండా పెరుగుతున్న నిత్యావసర ధరలను పరిగణలోకి తీసుకోకుండా ఆకు రేటు నిర్ణయించడంతోకూలీల కష్టానికి తగ్గఫలితం రాకుండా పోతోందని మాయిస్టు పార్టీ ఆక్షేపించింది. 

కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు కొమ్మ కొట్టే పనులకు మధ్యవర్తుల ద్వా రా కూలీలను సేకరించి, వారి కష్టానికి తగ్గ కూలీ చెల్లించడం లేదని మావోయిస్టుల లేఖలో పేర్కొన్నారు. కనీస వేతన చట్టం అమలు చేయడం అటుంచి సాధారణంగా రైతులు పంటచేల పనులకు ఇస్తున్నట్లు కూడా తునికాకు కొమ్మ కొట్టే కూలీలకు కాంట్రాక్టర్లు కూలీ చెల్లించకపోవడం బాధాకరమని, కొన్ని ప్రాంతాల్లో నేటికీ కాంట్రాక్టర్లు కూలీలకు చెల్లించాల్సిన పాత బకాయిలు అట్లాగే ఉన్నాయని, ఇప్పటికైనా వాటిని క్లియర్​ చేయాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు తగిన చొరవ చూపి గ్రామీణ పేదలకు సరైన ఉపాధి కల్పించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement