ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,532 సాంపిల్స్‌ను పరీక్షించగా… 2,930 మందికి పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.. మరో 36 మంది కరోనా బాధితులు మృతి చెందారు. మరోవైపు గడచిన 24 గంటల్లో 4,346 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,99,748కు పెరగగా.. మొత్తం డిశ్చార్జ్ అయిన కేసుల సంఖ్య 18,51,062కి చేరాయి. అలాగే కరోనా తో మృతిచెందినవారి సంఖ్య 12,815కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 35,871గా ఉన్నాయి..