Friday, November 22, 2024

ప్రముఖుల పేర్లతో 29 విమానాశ్రయాలు.. 24 ఎయిర్‌పోర్టులు, 5 టెర్మినళ్లకు పేరు మార్పు

దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలు, టెర్మినళ్ల పేర్లను ప్రముఖ వ్యక్తులు, జాతీయ నేతల మరణానంతరం వారి పేర్లతో మార్చడం జరిగింది. దేశవ్యాప్తంగా 29 విమానాశ్రయాలు, మరియు టెర్మినల్స్‌కు ప్రముఖ వ్యక్తుల పేర్లను పెట్టడం జరిగింది. తాజాగా చండీగర్‌ లోని షహీద్‌ భగత్‌ సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్చడం జరిగింది. దేశంలోని 24 విమానాశ్రయాలు, ఐదు టెర్మినల్స్‌కు మరణించిన ప్రముఖ వ్యక్తుల పేర్లను పెట్టడం జరిగింది. సెప్టెంబర్‌ 28న చండీగర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పేరుమార్చి షహీద్‌ భగత్‌ సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయమని పెట్టడం జరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడు 115వ జయంతికి ఒక్కరోజు ముందు ఈ పేరు పెట్టడం జరిగింది. జాబితా ప్రకారం పేరు మార్చిన నాలుగు విమానాశ్రయాల్లో మూడింటికి మాజీ ప్రధానమంత్రుల పేర్లు పెట్టడం జరిగింది. అవి దేశ రాజధాని నగరం ఢిల్లిdలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు, తెలంగాణలోని హైదరాబాద్‌లో రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, వారణాసిలోని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి విమానాశ్రయం, లక్నో లోని చౌదరీ చరణ్‌ సింగ్‌ విమానాశ్రయం. పలు విమానాశ్రయాలకు మాజీ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టడం జరిగింది. ఒడిషాలోని భువనేశ్వర్‌లో ఉన్న బిజూ పట్నాయక్‌ విమానాశ్రయం, ఇంకా కంగ్రా ఎయిర్‌ పోర్ట్‌, గగ్గాల్‌ మరియు కుల్లు మనాలి ఎయిర్‌పోర్టు, ఐదు టెర్మినల్స్‌కు సైతం ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టడం జరిగింది.

వాటిలో తమిళనాడులోని చెన్నయ్‌లో ఉన్న అన్న ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ మరియు కామరాజ్‌ డొమెస్టిక్‌ టెర్మినల్‌, మరోటి తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న ఎన్టీ రామారావు టెర్మినల్‌. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 131 విమానాశ్రయాలు ఉన్నాయి. వాటిలో 29 ఇంటర్నేషనల్‌ , 92 డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్టులు. మరో పది కస్టమ్స్‌ ఎయిర్‌ పోర్టులు. 8హెలిపోర్టులు, 2 వాటర్‌డ్రోములు ఉన్నట్లు అధికారిక గణాంకాలు. విమానాశ్రయాలకు పేర్లు పెట్టడం, వాటిని మార్చి తిరిగి కొత్త పేర్లు పెట్టడం చాలా పెద్ద ప్రక్రియ. తుది ఆమోదం కేంద్ర కేబినెట్‌ నుంచి లభిస్తుంది. సాధారణంగా విమానాశ్రయాలు అవి ఉన్న నగరాల పేర్లతో ఉంటాయి. ప్రత్యేక కేసుల్లో ప్రత్యేకమైన పేరును రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించి అందుకు మద్దతుగా రాష్ట్ర అసెంబ్లిdలో తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుతవ్‌నికి పంపడం జరుగుతుంది. విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండడంతో, ప్రభుత్వం 2030 నాటికి 220 విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement