Tuesday, November 19, 2024

డిగ్రీ కాలేజీల్లో 2858 పోస్టులు.. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులకు గానూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో కాంట్రాక్ట్‌ పద్ధతిన 527 మంది లెక్చరర్లను, 341 మందిని ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన, 50 మంది టీఎస్‌కేసీ ఫుల్‌ టైమ్‌ మెంటర్లను, 1,940 మందిని గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే ఈ పోస్టుల కాలపరిమితి 2024 మార్చి 31తో ముగియనుంది. లెక్చరర్‌ పోస్టులు-527, టీఎస్‌కేసీ ఫుల్‌ టైమ్‌ మెంటర్లు-50, గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు-1940, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు-29, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు-31, స్టోర్‌ కీపర్‌- 40, జూనియర్‌ స్టెనో – 01, రికార్డు అసిస్టెంట్‌ పోస్టులు-38, మ్యూజియం కీపర్‌ పోస్టులు-07, హెర్బేరియం కీపర్‌ పోస్టులు-30, మెకానిక్‌ పోస్టులు- 08, ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులు-157 భర్తీ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement