ప్రభ న్యూస్ : పూడూర్ మండల కేంద్రంలో గల దామ గుండం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 వ తేది శనివారం నుండి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటి చైర్మర్ అత్తెల్లి చంద్రశేఖర్, పూజారి భీమాచారి తెలిపారు. విడుదల చేసిన ప్రకటనలో వారు 26 వ తేదిన 11 గంటలకు దీపారాధన ధ్వజారోహణ కార్య క్రమం ఉంటుందని, 27 వ తేదిన తెల్లవారు జామున అగ్నిగుం డం రుధ్రాభిషేకం, ఉదయం 11 గంటలకు పార్వతి రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవం రాత్రి 10 గంటలకు రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.
28 వ తేదిన ఉదయం 10 గంటలకు సహస్ర లింగార్చన, 29 వ తేదిన రుద్రాభిషేకం , 30 వ తేదిన 6 గంటలకు రుధ్రాభిషేకం, 10 గంటలకు చ క్ర తీర్థంతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ముగుస్తాయని తె లిపారు. దామగుండం రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే యమ గండం తప్పుతుందని గరుడ పురాణంలో రాసి ఉందని వారు తెలిపారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..