న్యూఢిల్లి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అవినీతి ఆరోపణలపై మళ్లి చర్చ మొదలైంది. 2014 ప్రాథమిక టెట్ అవినీతి కేసులో జూన్‌లో సీబీఐ విచారణకు ఆదేశించింది. కలకత్తా హైకోర్టు తన చివరి ఉత్తర్వులో, 2017లో ప్రచురించిన రిక్రూట్‌మెంట్ జాబితా, అక్రమంగా జరిగిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ అని ప్రకటించింది. అలాగే 269 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని, పాఠశాల ప్రవేశంపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఆదేశించింది.
వారి జీతాలను నిలిపి వేసింది. కలకత్తా హైకోర్టు పరిశీలన సారాంశం ప్రకారం 2017లో రెండవ రిక్రూట్‌మెంట్ జాబితా చట్ట విరుద్ధంగా జరిగిందని కలకత్తా హైకోర్టు 269 మంది ఉపాధ్యాయులను పాఠశాలలో ప్రవేశానికి అనర్హులుగా సోమవారం ప్రకటించింది. జూన్ 13వ తేదీ సాయంత్రం 5.30 గంటలలోపు కేసు నమోదు చేయాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.