Wednesday, November 20, 2024

సెకండ్ వేవ్‌లో ఇప్పటివరకు 269 మంది వైద్యులు మృతి

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్‌లో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫ‌స్ట్ వేవ్ సంద‌ర్భంగా ఇండియాలో 748మంది డాక్ట‌ర్లు బ‌ల‌వ్వ‌గా, క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యానికి ఫ్రంట్ లైన్ వారియర్ల కింద దాదాపు డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది అంతా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో డాక్ట‌ర్ల‌కు, వైద్య సిబ్బందికి ఇబ్బంది ఉండ‌ద‌ని అంతా అనుకున్నారు.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు సెకండ్ వేవ్‌లో మ‌రో 269మంది డాక్ట‌ర్లు మ‌ర‌ణించారు. దీంతో క‌రోనా కాటుకు బ‌లైన వైద్యుల సంఖ్య 1000కి చేరింది. ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ లెక్క‌ల ప్ర‌కారం బీహార్, యూపీల్లో ఎక్కువ మంది డాక్ట‌ర్లు ప్రాణాలు విడిచారు. బీహార్‌లో 78, యూపీలో 37మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. ఇక సెకండ్ వేవ్‌కు దారుణంగా వ‌ణికిపోయిన ఢిల్లీలో 28 మంది డాక్ట‌ర్లు మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం హెల్త్ కేర్ వ‌ర్క‌ర్ల‌లో 66శాతం మంది మాత్ర‌మే రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement