శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. శబరిమలకు ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడిపిస్తుండగా.. మరిన్ని ప్రత్యేక రైళ్లను జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో వేర్వేరు చోట్ల నుంచి శబరిమలకు మొత్తం 26 అదనపు రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
హైదరాబాద్-కొల్లాం మధ్య 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. అందులో.. మౌలాలి-కొల్లాం మధ్య రైలు నెం.07143 నవంబర్ 22, 29… డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి… ఇక కొల్లాం – మౌలాలి మధ్య రైలు నెం. 07144 నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో మొత్తం 12 సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.
మచిలీపట్నం-కొల్లం రైలు నెం.07145 – నవంబర్ 18, నవంబర్ 25, డిసెంబర్ 2, 9, 16 తేదీల్లో నడపనున్నట్టు. కొల్లాం- మచిలీపట్నం రైలు నెం. 07146 నవంబర్ 20, 27, డిసెంబర్ 4, 11, 18 తేదీల్లో మొత్తం 10 సర్వీసులను నడుపుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
వీటితోపాటు మచిలీపట్నం-కొల్లం రైలు నెం.07147 డిసెంబర్ 23, 30 తేదీల్లో నడపనున్నట్టు.. అదేవిధంగా కొల్లాం- మచిలీపట్నం రైలు నెం. 07148 డిసెంబర్ 25, జనవరి 1వ తేదీన మొత్తం నాలుగు సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది.