భారత్‌లో కొవిషీల్డ్ టీకా వేసుకున్న 26 మందికి బ్లీడింగ్, బ్లడ్ క్లాటింగ్ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా తయారు చేసిన టీకాలను.. ఇండియాలో సీరం సంస్థ కొవిషీల్డ్ పేరుతో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రాజెనికా టీకాల వల్ల కొందరిలో రక్తం గడ్డ కట్టినట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. యూరోప్‌లో ఇలాగే 20 వరకు కేసులు నమోదు అయినట్లు రికార్డులు ఉన్నాయి. భారత్‌లో నమోదు అయిన బ్లీడింగ్, క్లాటింగ్‌కు సంబంధించిన నివేదికను నేషనల్ ఏఈఎఫ్ఐ కమిటీ ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖకు అందజేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement