Wednesday, January 1, 2025

256 Feet – రామ్ చరణ్ కు అభిమానుల మెగా కటౌట్‌ గిఫ్ట్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ . శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్‌ (గేమ్‌ ఛేంజర్‌ లుక్‌) కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్‌ పెట్టడం ఇదే తొలిసారి అని.. ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెబుతున్నారు. రామ్‌చరణ్‌ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు వారం రోజులు శ్రమించి దీనిని సిద్ధం చేశామని.. చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ నిర్మాణంలో భాగమైందని అభిమానులు తెలిపారు.

కాగా, ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నేటి సాయత్రం ఇక్కడ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ భారీ కటౌట్‌ ఏర్పాటు చేసారు.

- Advertisement -

సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కియారా అడ్వాణీ కథానాయిక. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదల కానుంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement