Sunday, November 10, 2024

TG | తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం : మంత్రి పొన్నం

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పొన్నం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల హామీలన్నింటినీ తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం అనువైన స్థలం కల్పిస్తుందని, వారికి 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

ఇక ఈ ఏడాది కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని, తెలంగాణను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోదండరాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement