Sunday, November 3, 2024

రాబోయే 25 ఏళ్ల పాటు ఎపి రైతుల‌కు ఉచిత విద్యుత్…

అమరావతి, ఆంధ్రప్రభ: వ్యవసాయాన్ని లాభదాయ కమైన కార్యకలాపంగా మార్చడంతోపాటు- రైతులకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా రాబోయే 25 ఏళ్లపాటు- రైతులకు ఉచిత విద్యుత్‌ అందించాలని లక్ష్యంగా పెట్టు-కుని ప్రభుత్వం ముందకు సాగుతోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా డాక్టర్‌ వైయస్సార్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాన్ని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి సంబంధించి సాధారణ విద్యుత్‌ సరఫరాపై విద్యుత్‌ శాఖ అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం -టె-లీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ పథకం రైతులకు భరోసా కల్పించిం దన్నారు. పంటలను మరియు వ్యవసాయాన్ని అత్యంత విలువైన కార్యకలాపంగా మార్చడానికి ఖచ్చితంగా ఇది సహాయం చేస్తున్నదని చెప్పారు. ఇది వ్యవసాయ ఉత్పాద కతను పెంపొందించడానికి, అన్ని ప్రాంతాలలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి మరియు ఆంధ్రప్రదేశ్‌ యొక్క సంపూర్ణ అభివృద్ధికి సహాయపడు తుందని పేర్కొన్నారు.

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుండి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 2.49 వంతున ధరకు కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాబో యే 25 ఏళ్లపాటు- రైతులకు నమ్మకమైన విద్యుత్‌ సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సెకీ సెప్టెంబర్‌ 2024 నుండి మొదటి విడతలో 3 వేల మెగావాట్లు-, రెండవ విడతలో 2025లో మరో 3 వేల మెగావాట్లు-, మూడో విడతలో 2026 నుండి వెయ్యి మెగావాట్లు- వంతున విద్యుత్‌ సరఫరా చేయడం ప్రారంభిస్తుందని వెల్లడించారు. రైతుకు అత్యంత సంతృప్తికరంగా వ్యవసాయ రంగానికి అత్యంత నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో అదే జోరు కొనసాగించాలని మంత్రి విద్యుత్తు సంస్థలకు సూచించారు.

డిస్కమ్‌ల పనితీరును మెరుగుపరచడానికి మరియు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను బలోపేతం చేయడానికి వ్యవసాయ కనెక్షన్‌లు మరియు ఎనర్జీ మీటర్ల ఏర్పాటు- కోసం రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) పథకాన్ని అమలు చేస్తోందని ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె విజయానంద్‌ తెలిపారు. ఎనర్జీ మీటర్ల సరఫరా మరియు ఇన్‌స్టాలేషన్‌ కోసం డీబీటీ- పథకం అమలు చేయడం పైలట్‌ ప్రాజెక్ట్‌గా తూర్పుప్రాంత విద్యుత్‌ సంస్థ (ఈపీడీసీఎల్‌)లోని శ్రీకాకుళం జిల్లాలో 28,684 వ్యవ సాయ కనెక్షన్లకు మీటర్లను అమర్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవసాయ వినియోగానికి సంబంధించిన నెలవారీ బిల్లింగ్‌ మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తోందని తెలిపారు.

చెల్లింపులు సకాలంలో అందకపోయినా డిస్కమ్‌లు రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరాను కొనసాగిస్తాయని పేర్కొన్నారు. డీబీటీ- కింద ఉన్న మొత్తం 16,67,389 వ్యవసాయ కనెక్షన్లలో 16,38,650 వ్యవసాయ కనెక్షన్ల కోసం వివిధ బ్యాంకుల్లో బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగిందని వివరించారు.6,770 ఫీడర్లలో 6652 ఫీడర్లు ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చేయగలవని విద్యుత్‌ శాఖ అధికారులు ఇంధన మంత్రికి వివరించారు. మిగిలిన 118 ఫీడర్లకు పగటిపూట 9 గంటలు సరఫరా చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పెంచాల్సి ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement