ఐపీఎల్ మరో రెం డు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ క్రికెట్ అభి మానులకు శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2022 మ్యాచ్‌లను ప్రత్య క్షంగా స్టేడియాలలో చూసేందుకు అభిమానులకు బీసీసీఐ అను మతి ఇచ్చింది. కోవిడ్ ప్రోటోకా ల్స్ ప్రకారం 25 శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటన చేసింది. దీంతో రెండేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లను క్రీడాభిమానులకు స్వయంగా వీక్షించే అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమ య్యాయి. మార్చి 23 మధ్యాహ్నం నుంచి టిక్కెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. కాగా ఐపీఎల్ 15వ సీజన్‌లో మొత్తం 65 రోజుల్లో 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్ జరగనున్నాయి.
మార్చి 26న వాంఖడే స్టేడి యంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్‌ల చొప్పున, నవీ ముంబైలోని బ్రబౌర్న్, ఎంసీఏ స్టేడియాలలో 15 చొప్పున మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 29న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా వేదికలను ఐపీఎల్ పాలక మండలి ఖరారు చేయాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..