ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో దాడులు చేస్తూనే ఉందని, శుక్రవారం నాటికి సుమారు 25లక్షల మంది ఉక్రెయిన్ వదిలి పొరుగు దేశాలకు వెళ్లిపోయినట్టు ఐక్యరాజ్య సమితి మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఆర్గెనైజేషన్ ఫర్ మైగ్రేషన్స్ (ఐఓఎం) మార్చి 10న ఇచ్చిన నివేదికతో పోల్చితే.. ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది పౌరులు వలస వెళ్లిపోయారు. వీరంతా పొరుగు దేశాలకు శరణార్థులుగా పారిపోయారు. 1.5 మిలియన్‌లకు పైగా శరణార్థులు పోలాండ్‌కు వెళ్లిపోయారని, 1,16,000 మంది శరణార్థులు మూడో దేశానికి చెందినవారు ఉన్నారని ఐక్యరాజ్య సమితి ఐఓఎం ప్రతినిధి పాల్ డిల్లాన్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో కూడా దాదాపు 2 మిలియన్‌ల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని యూఎన్ హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండి ప్రకటించారు. యూనిసెఫ్ డేటా ప్రకారం.. ఉక్రెయిన్ నుంచి ఇప్పటి వరకు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు తమ కుటుంబాలతో పోలాండ్, స్లోవేకియా, హంగెరీ, మోల్డోవా, రొమేనియాలకు వెళ్లిపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి.. అనేక దేశాలు తమ తమ పౌరులను అక్కడి నుంచి తరలించుకు పోయాయి. ఫిబ్రవరి 26న ప్రారంభించిన ఆపరేషన్ గంగా.. విజయవంతమైంది. 18,000 మంది భారతీయులను సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..