Tuesday, November 26, 2024

23 నుంచి పదో తరగతి పరీక్షలు.. సన్నాహాలు చేస్తున్న అధికారులు..

ప్రభన్యూస్ : పదో తరగతి పరీక్షలు ఈ నెల 23వ తేదీ మొద‌లు కానున్నాయి.. ఉదయం 9.30ల నుంచి మద్యాహ్నం 12.45 వరకు జరుగనున్నాయి. పది పరీక్షల కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మే 23న ఇంగ్లష్‌ పేపర్‌, మే 24 హింది, 25న తర్డ్‌ లాంగ్‌వేజ్‌, 26న మ్యాథ్స్‌ పేపర్‌, 17న మ్యాథ్స్‌ పేపర్‌-2, 27న జనరల్‌ సైన్స్‌ పేపర్‌, 28న సోషల్‌ స్టడీస్‌, 30న సైన్స్‌ స్క్రిప్ట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మే 23 నుంచి జూన్‌ 1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు కేంద్రాలను గుర్తించేందుకు మౌఖిక ఆదేశాలు జారిచేసింది.

ఇప్పటికే పరిక్ష కేంద్రాల ఏర్పాట్లు విద్యాధికారులు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైన నిమిషం ఆలస్యం కాకుండా విద్యార్ధులు పరిక్షల కేంద్రాలకు అర గంట ముందు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. పరిక్ష కేంద్రాల వద్దకు విద్యార్ధులు సకాలంలో చేరుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు, పరీక్షా కేంద్రాలకు ఒక కిలోమీటరు దూరం వరకు జిరాక్ష్‌ సెంటర్లను మూసి ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాలలో మాస్‌కాపియింగ్‌కు పాల్పడకుండా సీసీ కేమేరాలరు ఏర్పాటు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement