న్యూఢిల్లీ: చైనాకు కేంద్ర సర్కారు మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సంబంధించిన 232 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదేశాల మేరకు అత్యవసరంగా చైనా యాప్‌లను నిషేధించారు. భారత పౌరులకు ఆర్థికంగా నష్టం చేకూర్చేలా, భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేలా ఆయా మొబైల్ యాప్‌లు ఉన్నాయని, అందుకే వాటిపై నిషేధం విధించాలని నిర్ణయించామని కేంద్ర హోంశాఖ తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement